- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
18 నుంచి యెస్ బ్యాంక్ కార్యకలాపాలు షురూ!
యెస్ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త. బుధవారం (ఈ నెల 18) సాయంత్రం 6 గంటల నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాలు పునరుద్ధరిస్తున్నట్లు ఆ బ్యాంకు ప్రతినిధులు సోమవారం తెలిపారు. ‘మార్చి 19 (గురువారం) నుంచి దేశంలోని 1,132 శాఖలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని, ఖాతాదారులు ఎవరైనా సరే బ్యాంకు వేళల్లో సంప్రదించవచ్చు. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచే అన్నిరకాల డిజిటల్ సేవలు అందుబాటులోకి వస్తాయి’ అని ఆ బ్యాంకు ప్రతినిధులు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సంక్షోభంలో కూరుకుపోయిన యెస్ బ్యాంకులో వాటా కొనుగోలు కోసం దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
యెస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో ఈ నెల మొదట్లో ఆర్‌బీఐ జోక్యం చేసుకుని ఏప్రిల్ 3 వరకు మారిటోరియం విధించిన విషయం తెలిసిందే. ఆ బ్యాంకు బోర్డును రద్దు చేసి, కొత్త దాన్ని ఏర్పాటు చేసింది. నగదు ఉపసంహరణ రూ. 50 వేలకు పరిమితం చేసింది. అప్పటి నుంచి ఖాతాదారులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆ బ్యాంకు ఏటీఎంలు మూతపడ్డాయి. ఇతర బ్యాంకు ఏటీఎంల్లో యెస్ బ్యాంకు కార్డులు పనిచేయలేదు. యూపీఐ పేమెంట్లు నిలిచిపోయాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ స్తంభించింది. యెస్ బ్యాంకు కార్యకలాపాల పునరుద్ధరణ కోసం ఆర్‌బీఐ చేసిన ప్రతిపాదనలకు శుక్రవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆ బ్యాంకులో 49 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఎస్‌బీఐ ముందుకు వచ్చింది. దీంతో ఆ బ్యాంకు మూలధన విలువ రూ. 1,100 కోట్ల నుంచి రూ. 6,200 కోట్లకు పెరిగింది. అంతేకాకుండా యెస్ సంక్షోభ నివారణ కోసం వాటా కొనుగోలు కోసం హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకులు, పలు ఆర్థిక సంస్థలు కూడా ముందుకు వచ్చాయి.
Tags : yes bank, withdrawal limit news, yes bank to assume, full banking services from wednesday march18