ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం

by srinivas |
vishaka news
X

దిశ, ఏపీ బ్యూరో: ఏలూరు కార్పొరేషన్‌ను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. హైకోర్టు ఆదేశాలతో ఆదివారం ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ జరిగింది. మెుత్తం 50 డివిజన్లకు గానూ మూడు చోట్ల వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. దీంతో మిగిలిన 47 డివిజన్లకు ఎన్నిక జరిగింది. 47 డివిజన్లలో 44స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించగా, మూడు డివిజన్‌లలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఏకగ్రీవస్థానాలతో కలుపుకుని వైసీపీ మెుత్తం 47 చోట్ల విజయకేతనం ఎగురవేసి ఏలూరు మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఈ నెల 30న మేయర్ , డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఇకపోతే ఏలూరు కార్పొరేషన్‌కు మార్చి 10న ఎన్నికలు జరిగాయి. అయితే ఓటర్ల జాబితాలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా హైకోర్టు కౌంటింగ్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ఆదివారం సీఆర్ రెడ్డి కళాశాలలో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed