దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉంది : విజయసాయిరెడ్డి

by srinivas |
దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉంది : విజయసాయిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్ : టీడీపీ నేతల తీరుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదిక ఫైర్ అయ్యారు.పేద ప్రజలకు తమ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేద్దామనుకుంటే దానిని అడ్డుకోవడమే కాకుండా నిరసన దీక్షలు చేపడుతారా అని విమర్శించారు. దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉన్నదని తెలుగు తమ్ముళ్లను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ‘‘ఇళ్ల పట్టాల పంపిణీని ముందు నుంచి అడ్డుకునేది మీరే.. ఇప్పుడు దానిని వాయిదా వేయకుండా తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేసేది మేరే’’ మరీ ఇంత సిగ్గు విడిచి రాజకీయం చేయడం మీకు తగునా..అని విజయసాయి ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు.

Advertisement

Next Story