యాంకర్‌గా మారిన విజయసాయిరెడ్డి

by  |   ( Updated:2021-03-05 05:29:32.0  )
యాంకర్‌గా మారిన విజయసాయిరెడ్డి
X

దిశ వెబ్‌డెస్క్:వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడూ ప్రతిపక్ష టీడీపీపై విమర్శలతో విరుచుకుపడుతూ ఉంటారు. మీడియా ఛానెళ్లల్లోనే కాదు.. ట్విట్టర్‌లోనూ ఎప్పుడూ ప్రతిపక్ష పార్టీలపై విమర్శనస్త్రాలు సంధిస్తూ ఉంటారు. వైసీపీ వ్యవహారాల్లో కీలక వ్యాక్తిగా, సీఎం వైఎస్ జగన్‌కు నమ్మినబంటుగా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు మరో కొత్త అవతారమెత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇవాళ ఏపీ వ్యాప్తంగా బంద్ జరిగ్గా.. ఈ బంద్‌కు అధికార వైసీసీతో పాటు ప్రతిపక్ష టీడీపీ, ఇతర వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. పార్టీల నేతలు పలుచోట్ల ఆందోళన చేపట్టారు. మధ్యాహ్నం వరకు బస్సులు నిలిచిపోగా.. స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి.

అయితే విశాఖలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ముద్దిలపాలెం జంక్షన్‌లో మానవహారం జరగ్గా.. ఈ కార్యక్రమంలో విజయసాయిరెడ్డి యాంకర్‌గా మారారు. మైకు పట్టుకుని మానవహారంలో పాల్గొన్న వారితో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడించారు. దీంతో ఈ కార్యక్రమంలో విజయసాయిరెడ్డి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.

Advertisement

Next Story

Most Viewed