- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Viral Video: మంత్రి లోకేష్ చేతిలో స్టార్ హీరో ఫ్లెక్సీ.. ఆనందంలో ఫ్యాన్స్!

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) ఫ్లెక్సీని ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. నిన్న మంత్రి లోకేష్(Minister Nara Lokesh) గన్నవరం వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి లోకేష్‌కు టీడీపీ(TDP) కార్యకర్తలు జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో స్వాగతం పలికారు. వివరాల్లోకి వెళితే.. నిన్న(బుధవారం) కృష్ణాజిల్లా మల్లవల్లి ఇండస్ట్రీయల్ పార్కులో ‘అశోక్ లేలాండ్ ప్లాంట్’ను నారా లోకేష్ ప్రారంభించారు.
ఈ క్రమంలో నూజివీడు మండలం సీతారాంపురం వద్ద మంత్రి లోకేష్‌కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అంతేకాదు పార్టీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ఫొటో(Photo) ఫ్లెక్సీతో సందడి చేశారు. దీంతో కార్యకర్తలు, అభిమానుల చేతిలో ఉన్న జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీని మంత్రి నారా లోకేష్ చూశారు. ప్రారంభోత్సవంలో పాల్గొన్న సమయంలో లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని చేతికి అందుకున్నారు. కార్యకర్తల కోరిక మేరకు.. జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీ చూపెడుతూ టీడీపీ కార్యకర్తలను, నందమూరి అభిమానులను ఉత్సాహపరిచారు. దీంతో అభిమానులు మరింత సందడి చేశారు.
READ MORE ...
Gaddar Awards: గద్దర్ అవార్డులపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రకటన