Nagpur violence: నాగ్ పూర్ హింసలో బంగ్లాదేశీయుల ప్రమేయం..!

by Shamantha N |
Nagpur violence: నాగ్ పూర్ హింసలో బంగ్లాదేశీయుల ప్రమేయం..!
X

దిశ, నేషనల్ బ్యూరో: నాగ్ పూర్(Nagpur) హింసపై మహారాష్ట్రలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) కీలక వ్యాఖఅయలు చేశారు. ఈ అల్లర్లలో బంగ్లాదేశీయుల ప్రమేయం ఉందా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. నాగ్‌పూర్‌లో హింసకు సంబంధించిన కారణాలపై మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులతో ఫడ్నవీస్ సమావేశమయ్యారు. ఆ తర్వాతే ఈ వ్యాఖ్యలు చేశారు. హింసకు కారణమైన వారినుంచే ఆస్తి నష్టం మొత్తాన్ని వసూలు చేస్తామని ఫడ్నవీస్‌ పేర్కొన్నారు. వారు డబ్బు చెల్లించకపోతే ఆస్తులు స్వాధీనం చేసుకుని విక్రయిస్తామని బెదరించారు. అంతేకాకుండా, “బుల్డోజర్” చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘‘మతపరమైన వస్తువులు దహనం చేసినట్లు కొంతమంది సోషల్‌ మీడియాలో వదంతులు వ్యాప్తి చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి కారణమైన 104 మందిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. సోషల్‌ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాప్తిచేసి.. అల్లర్లకు కారణణైన వారిని కూడా నిందితులుగానే చూస్తాం. ఇప్పటివరకు 66 పోస్ట్‌లను తొలగించాము’’ అని ఫడ్నవీస్‌ అన్నారు. అంతేకాకుండా, హింసలో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు.

నాగ్ పూర్ హింసలో 34 మంది మృతి

ఇకపోతే, మార్చి 17న నాగ్‌పుర్‌ (Nagpur)లో కొందరు మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ తర్వాత ఉద్రిక్తతలను పెంచేలా నినాదాలు చేయడంతో హింసాత్మకంగా మారింది. హింసలో పలువురు గాయపడ్డారు. ఈ హింసాత్మక ఘటనలో 34 మంది పోలీసులు గాయపడ్డారని, ఇందులో ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు కూడా ఉన్నారని ఫడ్నవీస్‌ తెలిపారు. అల్లర్ల సమయంలో మహిళా కానిస్టేబులపై లైంగిక వేధింపులకు సంబంధించిన నివేదికలు నిజం కాదని ముఖ్యమంత్రి అన్నారు. "మహిళా పోలీసు కానిస్టేబుళ్లపై రాళ్లు రువ్వారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే వార్తలు నిజం కాదు" అని ఫడ్నవీస్ అన్నారు.

Next Story

Most Viewed