- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ముంతాజ్-షాజహాన్ ప్రేమకు చిహ్నాం తాజ్‌మహాలే కాదు.. ఈ పెర్ఫ్యూమ్ కూడా!

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజుల్లో పెర్ఫ్యూమ్ (Perfume) వాడని వారంటూ ఉండరు. ఇంటి నుంచి బయటికి అడుగుపెడుతున్నమంటే చాలు పెర్ఫ్యూమ్ కొట్టాల్సిందే. అది వెదజల్లే సువాసన నలుగురిలో మనల్ని ప్రత్యేకంగా ఉంచుతుంది. మన ప్రత్యేకతను చాటుతుంది. ఈ నేపథ్యంలోనే మార్కెట్‌లో వివిధ రకాల పరిమళాలతో అనేక బ్రాండ్ల పెర్ఫ్యూమ్‌లు అందుబాటులోకి వస్తుంటాయి. అలాగే దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. అయితే, ముంతాజ్-షాజహాన్ (Mumtaz-Shah Jahan) ప్రేమకు గుర్తుగా కూడా ఓ పెర్ఫ్యూమ్‌ను తయారుచేశారు. అంతేకాదు, అది ప్రపంచంలోనే అత్యధికంగా అమ్మడయ్యే పెర్ఫ్యూమ్‌లలో రెండో స్థానంలో నిలిచింది. ఇంతకీ ఆ పెర్ఫ్యూమ్ పేరు ఏంటి? ముంతాజ్-షాజహాన్ ప్రేమకు గుర్తుగా ఎందుకు తయారు చేశారు? ఈ స్టోరీలో తెలుసుకోండి.
మొగల్ చక్రవర్తి షాజహాన్-ముంతాజ్‌ల ప్రేమకథ అందరికి తెలిసిందే. ముంతాజ్ చనిపోయిన తర్వాత షాజహాన్ తమ ప్రేమకు గుర్తుగా ఏకంగా తాజ్ మహాల్‌నే కట్టాడు. అంతేకాదు, షాలిమార్ గార్డెన్స్‌ను కూడా ఏర్పాటు చేశాడు. ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్ సృష్టికర్త జాక్వెస్ గెర్లైన్ ఈ ప్రేమకథ గురించి తెలుసుకుని ముగ్ధుడయ్యాడు. వీరి ప్రేమ కోసం తాను కూడా ప్రత్యేకమైన పెర్ఫ్యూమ్‌ను తయారుచేయాలని నిశ్చయించుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే 1924లో గెర్లైన్ షాలిమార్ (Shalimar Guerlain) పేరుతో.. వెల్వెట్ వెనిల్లా, గంధం,రెసిన్ బెంజోయిన్, ఐరిస్, ప్యాచౌలి, ధూపం వంటి కలయికతో అద్భుతమైన స్పెషల్ పెర్ఫ్యూమ్‌ను తయారు చేశాడు. పెర్య్ఫూమ్ మాత్రమే కాదు, దాని బాటిల్‌కు కూడా ప్రత్యేకమైన డిజైన్‌ను ఎంపిక చేసుకున్నాడు. నీలిరంగు, ఫ్యాన్ ఆకారపు బాటిల్‌తో ఈ పెర్ఫ్యూమ్‌ని తీసుకొచ్చాడు. ఈ బాటిల్‌ని బాకరట్ క్రిస్టల్‌తో తయారు చేశారు. ఈ పెర్ఫ్యూమ్ బాటిల్ డిజైన్ 1925లో పారిస్‌లో జరిగిన ఇంటర్నెషనల్ డెకరేషన్ అవార్డుని గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి గంటకు 108 బాటిళ్లు అమ్ముడయ్యే పెర్ఫ్యూమ్‌గా రికార్డులకెక్కింది.
READ MORE ...
పెళ్ళికి వారం రోజుల ముందు ఈ పనులు అస్సలు చేయకూడదు .. ఎందుకంటే..?