- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Chandrababu Naidu : ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం : చంద్రబాబు

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Sessions) కొనసాగుతున్నాయి. కాగా నేటి సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ(SC Sub Classification)పై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో జనాభా లెక్కలు పూర్తయ్యాక, ఎస్సీ వర్గీకరణ చేస్తామని అన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. అయినప్పటికీ అసమానతలపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాలని తెలియజేశారు. కులవివక్షపై యుద్ధం చేసిన పార్టీ టీడీపీ అని, ఎన్టీఆర్(NTR) కాలం నుంచే సామాజిక న్యాయం కోసం తమ పార్టీ పనిచేసిందని అన్నారు.
ఒకప్పుడు కులవివక్షను రూపుమాపడానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ తానే తీసుకు వచ్చినట్టు గుర్తు చేశారు. జనగణన పూర్తయ్యాక మరోసారి జిల్లాల వారీగా కేటగిరీల విభజన చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga)ల కృషి వల్లే సాధ్యం అయిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఉషా మెహ్రా కమిషన్(Usha Mehra Commission) నివేదికను అసెంబ్లీలో చర్చ అనంతరం మనస్పూర్తిగా అంగీకరిస్తున్నట్టు తెలిపారు. మాదిగల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది మందకృష్ణ మాదిగ అని ఈ సందర్భంగా కొనియాడారు.