- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విద్యా రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది: మంత్రి పొన్నం

దిశ, సికింద్రాబాద్: విద్యా రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. నల్లగుట్ట, బాలంరాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి ఆయన సందర్శించారు. ఎఫ్ఎల్ఎన్, ఏఎక్స్ఎల్, ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్ ,సైన్స్ ల్యాబ్ లను ఆయన పరిశీలించారు. అనంతరం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
పరీక్షలు బాగా రాయాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యారంగం ప్రాముఖ్యతను గుర్తించి ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని, ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్ ద్వారా విద్యార్థుల పర్ఫామెన్స్ ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, డీఈఓ రోహిణి సికింద్రాబాద్ ఆర్ డి ఓ సాయిరాం, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.