Vijay Deverakonda: బెట్టింగ్ పెట్టిన ఫిట్టింగ్.. స్పందించిన విజయ్ దేవరకొండ టీమ్ (పోస్ట్)

by sudharani |   ( Updated:2025-03-22 14:22:10.0  )
Vijay Deverakonda: బెట్టింగ్ పెట్టిన ఫిట్టింగ్.. స్పందించిన విజయ్ దేవరకొండ టీమ్ (పోస్ట్)
X

దిశ, సినిమా: బెట్టింగ్ యాప్స్ (Betting apps) వ్యవహారం ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గత కొద్ది రోజులుగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (RTC MD VC Sajjanar) బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల(Social media influencers)తో పాటు సినీ సెలబ్రిటీల(Movie celebrities)పై కూడా కేసులు నమోదు అయ్యాయి. వారిలో టాలీవుడ్ (Tollywood) రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒకరు. గతంలో బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసిన కారణంగా విజయ్ దేవరకొండపై కేసు నమోదు కాగా.. దీనిపై విజయ్ పీఆర్ టీమ్ స్పందిస్తూ ఓ నోట్ రిలీజ్ చేశారు.

‘స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయడానికి అధికారికంగా ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని ప్రజలకు, సంబంధిత పార్టీలందరికీ తెలియజేయడానికే ఈ నోట్ రిలీజ్ చేస్తున్నాము. ఆన్‌లైన్ గేమ్‌లను చట్టబద్ధంగా అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే ఆయన ఆమోదం తెలిపారు. విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్‌గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అలాగే ఆ కంపెనీ లేదా ప్రాడక్ట్‌కు చట్టప్రకారం అనుమతి ఉంది అని వెల్లడైన తర్వాతే ఆయన ఆ యాడ్‌కు ప్రచారకర్తగా ఉంటారు. అలాంటి అనుమతి ఉన్న A23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ పనిచేశారు.

అయితే, అతని ఎండార్స్‌మెంట్ వ్యవధి 2023లో ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్‌కు ఎలాంటి సంబంధం లేదు. చట్టబద్ధంగా గుర్తింపు పొందిన నైపుణ్యం ఆధారిత గేమింగ్ (Skill-based gaming) కంపెనీకి మాత్రమే విజయ్ దేవరకొండ గతంలో ఆమోదం తెలిపారు. ఇల్లీగల్‌గా పనిచేస్తున్న ఏ సంస్థకూ ప్రచారకర్తగా వ్యవహరించలేదు. పలు మాధ్యమాల్లో ప్రసారమవుతున్న అపోహలు, తప్పుడు సమాచారంలో ఎలాంటి నిజం లేదు అని తెలియజేయడానికి ఈ నోట్ రిలీజ్ చేయడం జరిగింది’ అంటూ విజయ్ దేవరకొండ పీఆర్ టీమ్ వెల్లిడించింది.

Next Story

Most Viewed