- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కానిస్టేబుల్ కుటుంబానికి పోలీస్ శాఖ అండ : ఎస్పీ
by Naveena |

X
దిశ, కామారెడ్డి : విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ వడ్ల రవి కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరం అని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. కానిస్టేబుల్ వడ్ల రవి కుమార్ ను కోల్పోవడం డిపార్ట్మెంట్ కు తీరని లోటన్నారు. విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మార్చరి లో ఉన్న కానిస్టేబుల్ వడ్ల రవి కుమార్ మృతదేహాన్ని సందర్శించి తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ రవికుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎల్లప్పుడూ పోలీసు వ్యవస్థ తమ కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ రవికుమార్ కు పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
Next Story