‘కేసీఆర్ ఏది మాట్లాడిన రాజకీయమే’

by Anukaran |
‘కేసీఆర్ ఏది మాట్లాడిన రాజకీయమే’
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిపక్షాల విమర్శల నుంచి తప్పించుకునేందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల పై స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ నీటి నిల్వల పైన ఏపీకి హక్కు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా తెలంగాణలో నీటిని నిలిపివేస్తే.. ఆ హక్కు కూడా ఏపీకి కల్పించాలన్నారు.

కృష్ణా జలాల అంశాన్ని రాజకీయం చేయడం సరికాదని తెలంగాణ ప్రభుత్వం భావించింది కాబట్టే.. సుప్రీంకోర్టులో కేసును వెనక్కి తీసుకునేందుకు అంగీకరించిందన్నారు. అపెక్స్ మీటింగ్ తర్వాత కేసీఆర్ ఏది మాట్లాడిన అది రాజకీయం అవుతోందని.. ప్రతి పక్షాలు భాద్యతయుతంగా వ్యవహరించాలని ప్రకాశ్ రెడ్డి సూచించారు.

Advertisement

Next Story