నారా లోకే‌శ్‌తో వైసీపీ నేత భేటీ.. పార్టీ మారేందుకు రెడీ..!

by srinivas |   ( Updated:2021-06-25 08:13:00.0  )
నారా లోకే‌శ్‌తో వైసీపీ నేత భేటీ.. పార్టీ మారేందుకు రెడీ..!
X

దిశ, ఏపీ బ్యూరో: కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం వైసీపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి తనయుడు ప్రస్తుత వైసీపీ నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో భేటీ కావడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌లోని నారా లోకేశ్‌ నివాసానికి వెళ్లిన రాంప్రసాద్‌రెడ్డి ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న రాంప్రసాద్‌రెడ్డి త్వరలో వైసీపీకి గుడ్‌బై చెప్పి.. టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

ఒంటరైన నారా లోకేశ్.. హ్యాండ్ ఇస్తున్న టీడీపీ నేతలు

Advertisement

Next Story