చంద్రబాబు మానసిక పరిస్థితి బాగాలేదు..

by Anukaran |   ( Updated:2020-08-03 12:13:08.0  )
చంద్రబాబు మానసిక పరిస్థితి బాగాలేదు..
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మంత్రి పెర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సోమవారం నాని మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మానసిక స్థితి సరిగా లేదని సంచలన ఆరోపణలు చేశారు. ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డికి వేసిన సవాల్‌లో అర్ధం లేదని కొట్టిపారేశారు.

రాజధానికి భూములిచ్చిన రైతులను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. గత ఐదేండ్ల పాలనలో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించాడు తప్పా, చేసిందేమి లేద ని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధే మా లక్ష్యం అని మంత్రి నాని అన్నారు. అంతేగాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడని, ఆయన సినిమాలు చేసుకోవడమే బెటర్ అని అన్నారు.

Advertisement

Next Story