- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కుప్పంలో వైసీపీ అభ్యర్థి రాసలీలలు బట్టబయలు.. (వీడియో)
దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన ముఖ్యంగా చంద్రబాబు సొంత గడ్డ అయిన కుప్పంలో వైసీపీ జెండా ఎగురవేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్నారు. ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డా. సుధీర్ రాసలీలల వ్యవహారం బట్టబయలైంది. మద్యం మత్తులో మహిళతో రాసలీలలు జరుపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సదరు మహిళ డాక్టర్ సుధీర్ వీడియో తీస్తానని అంటుండగా వద్దు అని డాక్టర్ సుధీర్ అంటున్న వ్యాఖ్యలు వీడియోలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ వీడియోపై తెలుగు యువత నేత రవి నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుప్పం మున్సిపాలిటీ వైసీపీ చైర్మన్ అభ్యర్థి రాసలీలలు చూస్తుంటే సిగ్గేస్తోందని ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యక్తికి ఓటేస్తే మహిళల భద్రత ఎలా ఉంటుందో ప్రజలు అంతా గమనించాలని కోరారు. కుప్పంలో ఎలాంటి అసాంఘిక శక్తులు ప్రవేశించకుండా చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని అయితే ఈ ఎన్నికలతో కుప్పం నియోజకవర్గానికి రౌడీయిజం తీసుకువచ్చారని.. తాజాగా కామాంధులను తీసుకువచ్చారని తెలుగు యువత నేత రవినాయుడు ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులకు ప్రజలు తమ ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోపై వైసీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.