రిమోట్ జగన్ చేతుల్లోనే ఉంది : యనమల

by srinivas |
రిమోట్ జగన్ చేతుల్లోనే ఉంది : యనమల
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ఏ వ్యవస్థలను కూల్చాలన్నా, ధ్వంసం చేయాలన్నా దానికి సంబంధించిన రిమోట్ జగన్ చేతుల్లోనే ఉందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. జడ్జిపై దాడి నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. న్యాయమూర్తి రామకృష్ణపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని యనమల రామకృష్ణుడు తెలిపారు. జడ్జిలకే భద్రత లేకపోతే ఇక సామాన్యుడికి రక్షణ ఎలా ఉంటుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజకీయ నిరుద్యోగుల కోసమే శాండ్‌ కార్పొరేషన్ ఏర్పాటుకు ఏపీ మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని ఆయన విమర్శించారు. వైఎస్ఆర్సీపీ శాండ్‌ మాఫియాకే శాండ్‌ కార్పొరేషన్‌ పగ్గాలు కూడా అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారని యనమల ఆరోపించారు.

Advertisement

Next Story