అందుకే ఆ పెళ్లి వద్దనుకున్నా : యామీ గౌతమ్

by Shyam |
అందుకే ఆ పెళ్లి వద్దనుకున్నా : యామీ గౌతమ్
X

దిశ, సినిమా : హీరోయిన్ యామీ గౌతమ్, డైరెక్టర్ ఆదిత్యా ధర్‌ సీక్రెట్ మ్యారేజ్.. ఆడియన్స్‌కు షాక్‌ ఇచ్చింది. కొవిడ్ టైమ్‌లో అతికొద్ది మంది బంధువుల సమక్షంలో జరిగిన పెళ్లిలో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈ బంధం ముడిపడి నెలరోజులు పూర్తయిన సందర్భంగా.. తాము అందరు స్టార్స్‌లా మ్యారేజ్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోకపోవడానికి గల కారణాలు వివరించింది. ఇంతకుముందు చాలా మంది సెలబ్రిటీల పెళ్లిళ్లకు హాజరయ్యానని, కొన్నిసార్లు ఆ మ్యారేజ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకపోయినా ఇష్టం లేకుండానే అటెండ్ అయిన పరిస్థితులు ఉన్నాయని చెప్పింది. అందుకే తమను మనస్ఫూర్తిగా ఆశీర్వదించే అతిథులు, బంధువుల మధ్య పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. దీంతో ఫుడ్, ఫ్లవర్ డెకొరేషన్స్ వేస్టేజ్ జరగకుండా ఉంటుందని చెప్పింది. అంతేకాదు అలాంటి బిగ్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తే మ్యారేజ్‌కు అటెండ్ అయిన ప్రతీ ఒక్కరినీ హ్యాపీగా ఉంచడం సాధ్యం కాదని, అలాంటప్పుడు మనల్ని కేరింగ్‌గా చూసుకున్నవారినే సంతోషపరచడం మంచిది కదా అని వివరించింది యామీ.

Advertisement

Next Story

Most Viewed