నయా జోష్‌లో గజ్వేల్ టీఆర్ఎస్..

by Shyam |   ( Updated:2021-12-16 10:40:17.0  )
yadava reddy
X

దిశ, గజ్వేల్: గజ్వేల్ టీఆర్ఎస్‌లో నయా జోష్ నిండుకుంది. ఎమ్మెల్సీగా డాక్టర్ యాదవ రెడ్డి విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు ఉత్సహంతో ఉన్నారు. యాదవ రెడ్డి విజయంతో గజ్వేల్ నియోజక వర్గంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి యాదవ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. పార్టీలో చేరిన దగ్గర నుండి పార్టీ అభివృద్దికి కృషి చేశారు. ఆయనకు అప్పగించిన ప్రతి పనిని నిబద్దతతో పూర్తి చేయగల నాయకునిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఏడేళ్ళ నిరీక్షణ ఫలితంగానే ఎమ్మెల్సీ పదవి వచ్చిందంటున్నారు ఆయన అభిమానులు.

నాడు రంగారెడ్డి -నేడు యాదవ రెడ్డి..

గజ్వేల్ అంటేనే రాజకీయ క్షేత్రంలో ఓ సెంటిమెంట్ స్థానం. రాజకీయ ప్రముఖులకు పురిటి గడ్డగా ఈ ప్రాంతాన్ని పేర్కొంటారు. 1980 దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రులుగా పని చేసినా మర్రి చెన్నారెడ్డి, అంజయ్య కాలంలో గజ్వేల్ నుండి తొలిసారిగా ఈ నియోజకవర్గంలోనే కోడకండ్ల గ్రామానికి చెందిన మాదాడి రంగారెడ్డి ఎమ్మెల్సీగా పని చేశారు. 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ గజ్వేల్‌కు వంటేరు యాదవ రెడ్డి రూపంలో ఎమ్మెల్సీ అవకాశం దక్కింది.

mlc

Advertisement

Next Story