కలెక్టర్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం

by Shyam |   ( Updated:2020-10-15 06:48:21.0  )
కలెక్టర్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ ప్రయాణిస్తున్న కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటన జిల్లాలోని వలిగొండ మండలం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలు, పలు ప్రాంతాలను కలెక్టర్ అనితారామచంద్రన్ ఇవాళ ఉదయం నుంచి పరిశీలిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తిరిగి భువనగిరికి వెళ్తుండగా వలిగొండ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ లారీ ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత తక్కువగా ఉండడంతో కలెక్టర్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో కలెక్టరేట్ సిబ్బంది, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story