ప్రతిక్షణం యుద్ధ సన్నద్ధతతో ఉండండి : జిన్ పింగ్

by Shamantha N |
ప్రతిక్షణం యుద్ధ సన్నద్ధతతో ఉండండి : జిన్ పింగ్
X

న్యూఢిల్లీ : ప్రతి క్షణం యుద్ధ సన్నద్ధతో ఉండండని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆ దేశ మిలిటరీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని ఆదేశించారు. ఫుల్ టైం యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, అనుక్షణం అప్రమత్తత తప్పనిసరి అని తెలిపారు. ట్రూపు సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకోవాలని, శిక్షణలో సాంకేతికతను జోడించుకోవాలని సూచించారు. అధునాతన సాంకేతికతను వినియోగించుకోవాలని వివరించారు. అలాగే, సరికొత్త ఆయుధాలు, యుద్ధ సామగ్రిని సమకూర్చుకోవాలని, వాటి వినియోగంపైనా సుశిక్షితులవ్వాలని తెలిపారు.

శిక్షణ తీరు నిజంగా కదనరంగంలో తలపడే విధంగా ఉండాలని, కచ్చితంగా గెలిచితీరేలా జవాన్లు సిద్ధమవ్వాలని జీ జిన్‌పింగ్ సంతకం చేసిన ఈ ఏడాది తొలి సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఆదేశాలు పేర్కొన్నాయి. లడాఖ్ సరిహద్దులో భారత ఆర్మీ, చైనా పీఎల్ఏల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో డ్రాగన్ కంట్రీ ప్రెసిడెంట్ ఈ ఆదేశాలు చేయడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed