‘పసిడి’ పతకం ఇక కలేనా..? నిరాశపర్చిన భజరంగ్ పూనియా

by Shyam |
bajrang-punia
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత్ బంగారు పతకం ఆశలు మరోసారి గల్లంతయ్యాయి. భారత అథ్లెట్లు వరుసగా సెమీఫైనల్ మ్యాచ్‌లోనే ఇంటి ముఖం పడుతున్నారు. తాజాగా టోక్యో ఒలింపిక్స్ రెజ్లింగ్ 65 కేజీల పురుషుల విభాగం సెమీస్‌లో భజరంగ్ పూనియా ఓటమి పాలయ్యాడు. అజర్ బైజాన్ రెజ్లర్ హాజీ చేతిలో 12-5 తేడాతో ఘోర పరాజయం పాలయ్యాడు. క్వార్టర్‌లో సత్తా చాటిన భజరంగ్ సెమీస్‌లో టఫ్ పోటీ ఇవ్వకపోవడం అందరినీ నిరాశకు గురి చేసింది. కాగా, రేపు కాంస్య పతకం కోసం భజరంగ్ పూనియా మరోసారి తలపడనున్నాడు.

Advertisement

Next Story