- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘‘నన్ను పెళ్లాడతారా’’.. ట్రంప్ సపోర్టర్ ప్రశ్నకు నిక్కీ హేలీ సమాధానమిదీ
దిశ, నేషనల్ బ్యూరో : ‘‘మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?’’.. ఈ ప్రశ్న ఎవరికి ఎదురైందో తెలుసా ? రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్ధిత్వానికి పోటీపడుతున్న భారత సంతతి మహిళ నిక్కీ హేలీకి ఎదురైంది !! న్యూ హాంప్‌షైర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె ప్రసంగిస్తుండగా అకస్మాత్తుగా ఓ వ్యక్తి అడ్డుతగిలాడు. ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని 52 ఏళ్ల నిక్కీ హేలీని అడిగాడు. ఈ ప్రశ్న అడిగింది రిపబ్లికన్ పార్టీకే చెందిన తన ప్రత్యర్ధి డొనాల్డ్ ట్రంప్ మనిషి అని గ్రహించిన నిక్కీ చమత్కారంతో స్పందించారు. సమయోచితంగా వ్యవహరించి ప్రశ్నను మరో ప్రశ్నతో ఢీకొట్టారు. ‘‘మీరు నాకు ఓటు వేసే అంశాన్ని పరిశీలిస్తారా ?’’ అని ఆ వ్యక్తిని ఆమె ప్రశ్నించారు. దీంతో కాసేపు ఆలోచించుకున్న అతగాడు.. ‘‘నా ఓటు ట్రంప్‌కే’’ అని తేల్చి చెప్పాడు. ఆ వెంటనే అక్కడున్న నిక్కీ హేలీ మద్దతుదారులంతా అతడిపై భగ్గుమన్నారు. ఈ టైంలో నిక్కీ కూడా జోక్యం చేసుకొని.. ‘‘ఓహ్, ఇక్కడి నుంచి వెళ్ళిపో’’ అని వార్నింగ్ ఇచ్చారు. అనంతరం ఆ వ్యక్తి సిగ్గుతో తలదించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.