Volodymyr Zelenskyy:త్వరలోనే భారత పర్యటనకు జెలెన్స్కీ.. క్లారిటీ ఇచ్చిన ఉక్రెయిన్ రాయబారి

by Maddikunta Saikiran |
Volodymyr Zelenskyy:త్వరలోనే భారత పర్యటనకు జెలెన్స్కీ.. క్లారిటీ ఇచ్చిన ఉక్రెయిన్ రాయబారి
X

దిశ, వెబ్‌డెస్క్: ఉక్రెయిన్(Ukraine) అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్స్కీ(Volodymyr Zelenskyy) ఆహ్వానం మేరకు భారత(India) ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) గత నెల ఆగస్టు 23న ఆ దేశంలో పర్యటించిన సంగతి తెలిసిందే. 1991లో సోవియట్ యూనియన్(soviet Union) నుంచి ఉక్రెయిన్ విడిపోయిన తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్ లో పర్యటించడం ఇదే తొలిసారి.ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీని భారత్‌లో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీ కోరారు. మోడీ ఆహ్వానం మేరకు ఈ ఏడాది చివర్లో ఆయన భారత్‌కు రానున్నట్టు తెలుస్తోంది.పర్యటన ఎప్పుడనేది ఇంకా ఖరారు కానప్పటికీ త్వరలోనే ఆయన భారత్ లో పర్యటించే అవకాశముందని ఉక్రెయిన్ రాయబారి తెలిపారు.

భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి అలెగ్జాండర్ పోలిష్‌చుక్(Alexander Polishchuk) తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల ఉక్రెయిన్ లో పర్యటించిన ప్రధాని మోదీ భారతదేశాన్ని సందర్శించాల్సిందిగా జెలెన్స్కీని కోరారు.బహుశా ఈ సంవత్సరం చివరి నాటికి ఇక్కడ పర్యటించే అవకాశముందని , అది జరుగుతుందని నేను ఆశిస్తున్నాని తెలిపారు.జెలెన్స్కీ పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో మరో ముందడుగు వేయనుంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనపై చర్చించేందుకు ఇరువురు నేతలకు ఇది గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని పోలిష్‌ చుక్ వెల్లడించారు.అలాగే మా అధ్యక్షుడు ఎప్పుడూ భారతదేశానికి రాలేదని, భారత్ పర్యటన కోసం ఆయన చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.ఈ పర్యటన ఇరుపక్షాలకు గొప్ప అవకాశమని , అనుకూలమైన సమయంలోనే ఈ పర్యటన జరుగుతుందని అలెగ్జాండర్ పోలిష్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed