- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Game Changer: ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న గేమ్ ఛేంజర్ టీజర్ పోస్టులు
దిశ, వెబ్ డెస్క్ : ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సోల్ హీరోగా వస్తున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. స్టార్ డైరెక్టర్ శంకర్ ( Shankar) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు డబ్బు విషయంలో ఎక్కడా తగ్గకుండా సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ కు జోడిగా బాలీవుడ్ నటి కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.
మూడేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి సరైన అప్డేట్స్ రాలేదు. అయితే, ఈ సినిమా నుంచి ఈ సారి చెప్పిన డేట్ కి టీజర్ విడుదల చేశారు. దీంతో అభిమానులు కూడా ఫుల్ ఖుష్ అవుతున్నారు. టీజర్ లో చరణ్ డైలాగ్స్ అందర్ని ఆకట్టుకున్నాయి. అలాగే రామ్ చరణ్ లుక్స్ సూపర్ అనే చెప్పాలి. శనివారం సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేసిన ఈ టీజర్ను ఇప్పటికి తెలుగులో 25 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ట్విట్టర్ లో అయితే ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఇప్పటికి 3 లక్షలకు పైగా గేమ్ ఛేంజర్ టీజర్ కి సంబంధించిన పోస్ట్లు పెట్టారు. ఇది కూడా ఒక రికార్డు అనే చెప్పుకోవాలి.