- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Iran: హమాస్ చీఫ్ హనియే హత్య గుర్తుందా?.. అమెరికాపై ఇరాన్ విసుర్లు
దిశ, నేషనల్ బ్యూరో: డొనాల్డ్ ట్రంప్‌ను(Donald trump) హత్యక ఇరాన్(Iran) కుట్ర పన్నిందని అమెరికా చేసిన ఆరోపణలను టెహ్రాన్ ఖండించింది. ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నిందని.. దాన్ని ఎఫ్‌బీఐ అధికారులు భగ్నం చేశారని అమెరికా న్యాయ విభాగం పేర్కొంది. కాగా.. ఆరోపణనలు ఖండిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాకీ(Abbas Araqchi) ఎక్స్ లో పెస్టు పెట్టారు. ‘మా అధ్యక్షుడు ప్రమాణస్వీకారానికి హాజరైన సమయంలో హమాస్ చీఫ్ హనియే హత్య గుర్తుందా? అది ఎవరు, ఎందుకు చేశారో అందరికీ తెలుసు. ఇప్పుడు అమెరికాలో ఎన్నికలు జరగగానే మరో లక్ష్యాన్ని చూపిస్తున్నారు. హంతకుడు ఇరాన్‌లో కూర్చుని ఎఫ్‌బీఐతో ఆన్‌లైన్‌లో మాట్లాడుతున్నారనేదాన్ని ఎవరైనా నమ్ముతారా? అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రజలు తమ నిర్ణయం తీసుకున్నారు. వారి నిర్ణయాన్ని ఇరాన్ (Iran) గౌరవిస్తుంది. ఇరు వైపుల నుంచి నమ్మకాన్ని ఏర్పరుచుకోవడం అసరం’ అని అరాకీ రాసుకొచ్చారు.
ట్రంప్ హత్యకు కుట్ర..!
మరోవైపు ట్రంప్ (Donald trump) హత్య కుట్రలో ఇరాన్ ప్రమేయాన్ని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఎస్మాయిల్ బఘై సైతం ఖండించారు. అమెరికా న్యాయశాఖ నివేదిక అవాస్తమని, పూర్తిగా నిరాధారమైనదన్నారు. గతంలోనే తమపై ఇలాంటి ఆరోపణలు చేశారని, వాటిని తాము తీవ్రంగా ఖండించామన్నారు. ఇరుదేశాల మధ్య సమస్యలు తగ్గించుకోకుండా, మరింత క్లిష్టతరం చేయడానికి జియోనిస్ట్, తమ వ్యతిరేక వర్గాలు ఈ రకమైన కుట్రలు రూపొందిస్తున్నారన్నారు. ఇకపోతే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నిందని.. దాన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(FBI) అధికారులు భగ్నం చేశారని అమెరికా న్యాయ విభాగం తెలిపింది. ఈ మేరకు మన్‌హట్టన్‌లోని ఫెడరల్ కోర్టులో అభియోగాలను నమోదు చేసింది. ఇందులో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దళానికి (IRGC)కి చెందిన ఓ గుర్తు తెలియని అధికారిని కూడా జస్టిస్ డిపార్ట్‌మెంట్ చేర్చింది. ఈ కుట్రలో పాల్గొన్న మరో వ్యక్తి పేరును ఫర్జాద్ షకేరీగా పేర్కొంది. ఇరాన్‌లో ఉంటున్న షకేరీ అమెరికాలో తనకు తెలిసిన ఇద్దరు వ్యక్తులను ఈ హత్య ప్రణాళికను అమలు చేసేందుకు ఎంపిక చేసుకున్నాడని ఎఫ్‌బీఐ పేర్కొంది. వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది.