కూలీ పనులకు వెళ్లొస్తూ.. అనంతలోకాలకు..

by Sumithra |
కూలీ పనులకు వెళ్లొస్తూ.. అనంతలోకాలకు..
X

దిశ, కౌడిపల్లి : ఎదురెదురుగా వస్తున్న కారు బైక్ ఢీకొన్న సంఘటన శనివారం రాత్రి మహమ్మద్ నగర్ గేటు వద్ద మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కన్నడం గ్రామానికి చెందిన పానుగంటి సాయిలు (35) గుమ్మడిదల వద్ద అడ్డా కూలిగా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగా శనివారం గుమ్మడిదలకు వెళ్లి కూలి పనులు ముగించుకుని ఇంటికి వస్తున్నాడు.

ఈ క్రమంలో మహమ్మద్ నగర్ గేట్ వద్దకు రాగానే మెదక్ నుంచి నర్సాపూర్ వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న బైకును ఢీకొంది. దీంతో బైక్ పై ఉన్న సాయిలుకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతించాడు. మృతునికి భార్య అమృత, కూతురు కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యులు అదే రాత్రి నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పోస్టుమార్టం అనంతరం సాయిలు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుని భార్య అమృత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి తెలిపారు.

Next Story