US: అమెరికాలో భారత్ కు చెందిన తండ్రి, కుమార్తె హత్య

by Shamantha N |
US: అమెరికాలో భారత్ కు చెందిన తండ్రి, కుమార్తె హత్య
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో భారత్ కు చెందిన తండ్రి, కుమార్తెల దారణ హత్య జరిగింది. వర్జీనియాలోని డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో దుండుగుడు ప్రదీప్ పటేల్, ఉర్మిలపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ హత్యల కేసులో జార్జ్ ఫ్రేజియర్ డెవాన్ వార్టన్ (44) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు గురువారం తెల్లవారుజామున అకోమాక్ కౌంటీలోని దుకాణంలో మద్యం కొనడానికి చేరుకున్నాడని తెలిపారు. అయితే, రాత్రి షాప్ ఎందుకు మూసివేశారని ప్రశ్నించాడని.. ఆ తర్వాత అతను తండ్రీకూతుళ్లపై కాల్పులు జరిపాడని వెల్లడించారు. కాగా.. ప్రదీప్ పటేల్(56) అక్కడికక్కడే మరణించగా, అతని కుమార్తె ఉర్మి(24) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

గుజరాత్ నుంచి వలస

ఇకపోతే, ప్రదీప్ పటేల్, అతని భార్య హంసబెన్, వారి కుమార్తె ఉర్మి గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాకు చెందినవారు. అయితే, ఆరేళ్లక్రితం వారు అమెరికాకు వలస వెళ్లారు. వారి బంధువు పరేష్ పటేల్ యాజమాన్యంలోని కన్వీనియన్స్ స్టోర్‌లో పనిచేస్తున్నారు. ఇకపోతే, స్టోర్ మేనేజర్, ప్రదీప్ పటేల్ బంధువు పరేష్ పటేల్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. "నా కజిన్ భార్య, ఆమె తండ్రి ఉదయం స్టోర్ లో పని చేస్తున్నారు. ఎవరో ఇక్కడకు వచ్చి కాల్పులు జరిపారు. నాకు ఏమి చేయాలో తెలియడం లేదు" అని చెప్పుకొచ్చారు. మరోవైపు, నిందితుడు వార్టన్‌పై ఫస్ట్-డిగ్రీ హత్య సహా ఇతర సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.ఇటీవలే నార్త్ కరోలినాలో కన్వీనియన్స్ స్టోర్ నడుపుతున్న భారతీయ సంతతికి చెందిన మైనాంక్ పటేల్ హత్య మరువక ముందే మరో ఘటన ఇలాంటిదే జరగడం గమనార్హం.



Next Story

Most Viewed