- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రానున్న రెండు వారాల్లో ప్లాస్టిక్ రహితంగా జిల్లా కలెక్టరేట్.. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్..

దిశ, ఖమ్మం సిటీ : రానున్న రెండు వారాల్లో సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ లు డా.పి.శ్రీజ, పి.శ్రీనివాస్ రెడ్డి, శిక్షణా కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠలతో కలిసి పరిపాలనకు సంబంధించి వివిధ అంశాల పై జిల్లా అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ వచ్చేవారం నుంచి గర్ల్ ప్రైడ్ పర్యటనలు ప్రారంభం కావాలని అన్నారు. ఖమ్మం జిల్లాలో ఆడపిల్లలు పుట్టిన ఇండ్లకు జిల్లా అధికారులు వెళ్తారని, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపి స్వీట్ బాక్స్, జిల్లా యంత్రాంగం తరపున చిన్న సందేశం అందించి రావాలని అన్నారు.
ఆడ పిల్లలు పుట్టిన ఇండ్లకు జిల్లా అధికారులు వెళ్లేందుకు వీలుగా షెడ్యూల్ జిల్లా సంక్షేమ అధికారి తయారు చేసి ప్రతి జిల్లా అధికారికి చేరవేయాలని కలెక్టర్ సూచించారు. అమ్మాయిలు ఇంట్లో పుట్టటం అదృష్టం అనే భావన ప్రజల్లో వెళ్లేలా ఈ కార్యక్రమం జరగాలని అన్నారు. మధ్యాహ్న భోజన పథకం సంబంధించి జిల్లా అధికారులు ప్రభుత్వ పాఠశాలలను రెగ్యులర్ గా సందర్శిస్తున్నారని కలెక్టర్ అభినందించారు. భోజన నాణ్యతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, క్షేత్రస్థాయి పరిస్థితుల పై అధికారుల ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని అన్నారు.
10వ తరగతి పరీక్షల నేపథ్యంలో ప్రతి రోజు సాయంత్రం జిల్లా అధికారులు విద్యార్థుల ఇంటికి వెళ్లి విద్యార్థి పరీక్షల సన్నద్ధతను గమనించాలని, వారి తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అవుతూ విద్యార్థికి నాణ్యమైన ఆహారం అందించడం, ఒత్తిడి లేకుండా ఉండటం వంటి అంశాల పై అవగాహన కల్పించాలని అన్నారు.
ఖమ్మం సమీకృత జిల్లా కలెక్టరేట్ ను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, క్యాంటీన్ లో కూడా ప్లాస్టిక్ కాకుండా స్టీల్ వస్తువులు మాత్రమే వాడాలని, అవసరమైన మేర డిష్ వాషర్లు కూడా తెప్పిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ సమావేశాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లను నిషేధించాలని కలెక్టర్ తెలిపారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్లో పనిచేసే సిబ్బందికి కూడా స్టీల్ బాటిల్స్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రతి శాఖ నుంచి అవసరమైన బాటిల్స్ వివరాలు అందించాలని అన్నారు. రాబోయే 2 వారాల్లో ప్లాస్టిక్ వాడకం పూర్తి స్థాయిలో తగ్గించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. మండలాల్లోని తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో కూడా ప్లాస్టిక్ నివారణకు ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్ లో మెడిటేషన్ సెషన్స్ మధ్యాహ్నం పెట్టేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు. ఒత్తిడి లేకుండా వర్కింగ్ వాతావరణం ఉండాలని అన్నారు.
రాబోయే 2 వారాల్లో ప్రభుత్వ సిబ్బందికి రెండోసారి హెల్త్ చెక్ అప్ ఉంటుందని అన్నారు. క్రచ్ సెంటర్ లో వేసవి రానున్న దృష్ట్యా ఏసీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఖమ్మం ఆసుపత్రి ఎదురుగా వాల్ ఆఫ్ కైండ్ నెస్ ఏర్పాటు చేశామని, జిల్లా అధికారులు కూడా పరిశీలించి, దీని పై స్టాఫ్ కు సమాచారం అందించాలని అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీఆర్వో ఏ.పద్మశ్రీ, కలెక్టరేట్ ఏవో అరుణ, కలెక్టరేట్ లోని జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.