Vidadala Rajini: ఆరోజు మీ ముఖాలు ఎలా ఉంటాయో.. ఎదురుచూస్తూ ఉంటా

by Gantepaka Srikanth |
Vidadala Rajini: ఆరోజు మీ ముఖాలు ఎలా ఉంటాయో.. ఎదురుచూస్తూ ఉంటా
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ(YCP) ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌ యజమాన్యాన్ని విజిలెన్స్‌(Vigilance) తనిఖీల ముసుగులో బెదిరించి.. రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై మాజీ మంత్రి విడదల రజిని(Vidadala Rajini)పై ఏసీబీ(ACB) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుపై ఆమె సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింట్ ట్వీట్ పెట్టారు.

‘‘మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే నాపై కుట్రలు చేస్తున్నారు. వ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులు పన్నుతున్నారు. అక్రమ కేసులే మీ లక్ష్యమైతే వంద కేసులు ఎదుర్కొంటా.. విష ప్రచారాలే లక్ష్యమైతే వేయి ప్రచారాలు ఎదుర్కొంటా.. నా నిజాయితీ, సత్యం, ధర్మమే నా ధైర్యం.. నిజం బయటపడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో.. చూడటానికి నేను ఎదురుచూస్తూ ఉంటా’’ అని విడదల రజిని నెట్టింట్లో పేర్కొన్నారు.

Next Story

Most Viewed