స్నేహితుని పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిన వ్యక్తి.. ఎంతకీ తిరిగి రాడే..

by Sumithra |
స్నేహితుని పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిన వ్యక్తి.. ఎంతకీ తిరిగి రాడే..
X

దిశ, తూప్రాన్ : స్నేహితుని పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిన వ్యక్తి అదృశ్యం అయినట్టు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. వివరాల్లోకెళితే బహదూర్ పల్లి నివాసులు అయిన కంకిపాటి సుబ్బారావు బతుకుదెరువు కోసం ప్రస్తుతం మండల పరిధిలోని కుచారం గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అతని కొడుకు పృథ్వీరాజ్ (28) ఈ నెల తేది 20 న స్నేహితుని పుట్టిన రోజు ఉందని చెప్పి రాత్రి 11.45 నిమిషాలకు ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదని తెలిపారు. ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తుందని చుట్టు ప్రక్కల వెతికినా ఆచూకీ లభించలేదని, తన కొడుకు గురించి వెతకడంతో ఫిర్యాదు ఆలస్యంగా ఇచ్చానని పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు..

Next Story