ACB Raids: మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు.. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో భారీగా అక్రమాస్తులు

by Y.Nagarani |
ACB Raids: మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు.. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో భారీగా అక్రమాస్తులు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో రెండోరోజు ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. మదనపల్లి రెవెన్యూ ఫైల్స్ (Madanapalle Revenue Files Case) దగ్ధమైనపుడు అక్కడ ఆర్టీఓగా ఉన్న మురళి పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న మురళీ ఇంటితో పాటు.. తిరుపతి పరిసరాల్లో ఉన్న ఆయన సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు. మొత్తం 14 టీమ్ లు రంగంలోకి దిగి సోదాలు చేస్తున్నాయి. ఇప్పటి వరకూ జరిపిన సోదాల్లో.. మురళి వందలకోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు.

తిరుపతి (Tirupati) పరిసరాల్లో 20కి పైగా ఫ్లాట్లు, 2 ఎకరాల వ్యవసాయ భూమి, 1 పౌల్ట్రీ ఫామ్స్, 5 ఎకరాల మామిడితోట పత్రాలను, 700 గ్రాముల గోల్డ్, 10 బ్యాంక్ ఖాతాల లాకర్స్ ను గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. మురళీ తన సన్నిహితులు, బంధువుల పేర్లపై భారీగా ఆస్తులు కూడబెట్టినట్లుగా అధికారులు గుర్తించారు. వారి ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు.

Advertisement

Next Story