- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Yadagiri Gutta : యాదగిరి గుట్టకు కార్తీక శోభ..భారీగా భక్తుల రద్దీ

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట(Yadagiri Gutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం భక్తుల రద్ధీ(crowd of devotees)తో కిటకిటలాడింది. కార్తీక మాసం, అదివారం సెలవు దినం కావడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం తరలివచ్చారు. సత్యనారాయణ వ్రతాలలో, కార్తీక దీపారాధనలలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల రద్దీతో యాదగిరి గుట్ట పరిసరాలు భక్త జనసంద్రంగా మారాయి. ప్రధానాలయంలో స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి వారి నిత్య పూజలు, నిత్య కల్యాణోత్సవాలు ఘనంగా కొనసాగాయి.
Next Story