YCP : వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జీ భార్గవ్ రెడ్డి సహా ముగ్గురిపై నాన్ బెయిలబుల్ కేసులు

by Y. Venkata Narasimha Reddy |
YCP : వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జీ భార్గవ్ రెడ్డి సహా ముగ్గురిపై నాన్ బెయిలబుల్ కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైసీపీ(YCP) సోషల్ మీడియా విభాగంపై ఉక్కు పాదం మోపుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతలపై అభ్యంతర పోస్టులు పెట్టడం, అధికారం కోల్పోయక కూడా అసహనంతో అదే దాడిని కొనసాగిస్తున్నారంటూ ఆ పార్టీ సోషల్ మీడియా విభాగంపై చంద్రబాబు ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో తాజాగా

వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి సజ్జల భార్గవ్ రెడ్డి(Bhargav Reddy)పైన, రాష్ట్ర నేత అర్జున్ రెడ్డిపైన, వైఎస్ భారతీ పీఏ వర్రా రవీందర్ రెడ్డిలపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. పులివెందుల పోలీసులు సజ్జల భార్గవ్ రెడ్డి సహా ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ప్రశ్నించిన తనను కులం పేరుతో దూషించారంటూ సింహాద్రిపురం దళిత సామాజిక వర్గానికి చెందిన హరి ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. వైసీపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన పలువురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అరెస్టయిన వారి వర్రా రవిందర్ రెడ్దితో పాటు గుంటూరు సోషల్ మీడియా విభాగం ఇంచార్జి మేక వెంకట్రామ్ రెడ్డి, ఇంటూరి రవి కిరణ్ లు ఉన్నారు. ప్రభుత్వ చర్యలతో వరుస కేసులు, అరెస్టులతో వైసీపీ సోషల్ మీడియా విభాగం హడలెత్తిపోతోంది. దీంతో స్వయంగా మాజీ సీఎం వైఎస్ జగన్ రంగంలోకి దిగి సోషల్ మీడియా వర్కర్స్ భయపడాల్సిన పని లేదని, వారికి అండగా లీగల్ టీమ్ ను ఏర్పాటు చేశామని ప్రకటించారు. అరెస్టులను అడ్డుకునేందుకు కోర్టుల్లో హెబిఎస్ కార్పోరేషన్ పిటిషన్లను కూడా వైసీపీ దాఖలు చేసింది.

Advertisement

Next Story