Sowmya Rao: అమ్మకి బ్రెయిన్ క్యాన్సర్.. తినడానికి తిండి లేదు.. జబర్దస్త్ యాంకర్ ఎమోషనల్ కామెంట్స్

by Kavitha |
Sowmya Rao: అమ్మకి బ్రెయిన్ క్యాన్సర్.. తినడానికి తిండి లేదు.. జబర్దస్త్ యాంకర్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: సాధారణంగా చాలా మంది సెలబ్రిటీలు నేడు ఈ స్థాయికి రావడానికి గతంలో ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు. అన్నం, వసతి లేక వారు రోడ్ల పై పడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక అవకాశాల కోసం స్టూడియోల గేట్స్ వద్ద పరి కాపు కాసిన రోజులు కూడా ఉన్నాయి. అలా గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులను వీరు చాలా సందర్భాల్లో వెల్లడించి ఎమోషనల్ అవుతారు. అయితే తాజాగా ఈ యాంకర్ కూడా తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను పంచుకుంది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కన్నడ అందాల తార సౌమ్య రావు తెలుగు టీవీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన పేరు. ఒకప్పుడు 'జబర్దస్త్' వేదికపై తన కామెడీతో ప్రతి ప్రేక్షకుడి మన్ననలు అందుకున్నది. వచ్చిరానీ తెలుగులో తన స్వీట్ వాయిస్‌తో మాట్లాడుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ప్రస్తుతం ‘కిర్రాక్ బాయ్స్.. ఖిలాడి గర్ల్స్’ అనే షోలో చేస్తోంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన జీవితంలో ఎదురైన కష్టాల గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ.. “నిజానికి మాది బెంగళూరు. నాకు తెలుగు పెద్దగా రాదు కానీ తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ప్రేమగా స్వీకరించారు” అంటూ సౌమ్యారావు కృతజ్ఞత భావం వ్యక్తం చేసింది. అలాగే తన చిన్ననాటి గురించి ఆమె చెబుతూ, “నా మొదటి గురువు నా అమ్మగారే. ఆమె సంగీత క్లాసులు తీసుకుని మమ్మల్ని పోషించేది. కానీ మా కుటుంబం ఒక దశలో ఆర్థిక కష్టాల్లో పడింది. ఆ సమయంలో అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. ఆ టైంలో మాకు తినడానికి తిండి కూడా దొరకలేదు. మార్నింగ్ నుంచి రాత్రి పదకొండు గంటల వరకు వెయిట్ చేసేవాళ్లం భోజనం కోసం. ఎందుకంటే ఎవరి ఇంట్లో అయినా అన్నం మిగిలిపోతే తీసుకొచ్చి మాకు ఇస్తారని. అసలు ఆ కష్టం మా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ కష్టాలు నన్ను మానసికంగా మరింత బలంగా మార్చాయి” అని ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story