3,50,000 మంది పిల్లలకు పాలు డొనేట్ చేసి రికార్డు సృష్టించిన తల్లి

by Mahesh |   ( Updated:2024-11-10 16:04:39.0  )
3,50,000 మంది పిల్లలకు పాలు డొనేట్ చేసి రికార్డు సృష్టించిన తల్లి
X

దిశ, వెబ్ డెస్క్: అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లిపాల(breast milk)ను మించిన పౌష్టికాహారం ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఇది మానవ జాతిలోనే కాదు భూమిపై ఉన్న ప్రతీ ప్రాణికి ముఖ్యమైనది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే నేటి సమాజంలో కొంత మంది పిల్లలకు వివిధ కారణాల వల్ల తల్లి పాలు(breast milk) అందడం లేదు. దీంతో అనేకమంది పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. అలాంటి వారిని చూసి చలించిపోయిన ఓ తల్లి తన రొమ్ము పాలు(breast milk) పిల్లలకు దానంగా ఇస్తుంది. వందలు, వేలు కాదు ఏకంగా 3,50,000 మంది పిల్లలకు తన రొమ్ము పాలను డొనేట్ చేసి.. అమెరికాకు చెందిన అలీస్ ఓగ్లెట్రీ(Alice Ogletree) రికార్డు సృష్టించింది. అంతే కాకుండా గిన్నిస్ బుక్ రికార్డు(Guinness book record)ను కూడా ఆమె సొంతం చేసుకున్నారు. ఓగ్లెట్రీ 2023 సంవత్సరానికి 2,645 లీటర్ల దానం(donating) చేసి ఈ రికార్డు క్రియేట్ చేశారు. ఆమె గతంలోను 1,569 లీటర్ల రొమ్ము పాలను పిల్లలకు అందించారు. కాగా ఆమెకు గిన్నిస్ బుక్ రికార్డు అందడంతో.. తాను మొత్తం 3,50,000 మంది పిల్లలకు సాయం చేయడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. కాగా అలీస్ ఓగ్లెట్రీకి ఇద్దరు పిల్లలు ఉండగా.. సరోగేట్ మదర్ గా కూడా సేవలు అందించారు.


Read More ...

జీవితంలో ఈ రెండు విషయాలకు బాధపడకండి..!


Advertisement

Next Story