Cannabis: ఢిల్లీలో ఇంట్లోనే గంజాయి సాగు

by Mahesh Kanagandla |
Cannabis: ఢిల్లీలో ఇంట్లోనే గంజాయి సాగు
X

దిశ, నేషనల్ బ్యూరో: గ్రేటర్ నోయిడా(Greater Noida)కు చెందిన వ్యక్తి ఇంట్లోనే గంజాయి నర్సరీ(Cannabis Nursery) పెట్టాడు. గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ సెటప్‌తో 50 కుండీల్లో నాలుగు నెలలుగా గంజాయి మొక్కల సాగు చేస్తున్నాడు. అవీ ఓజీ అని పిలుచుకునే ప్రీమియమ్ క్వాలిటీ గంజాయి మొక్కలు. డార్క్ వెబ్ ద్వారా ఈ గంజాయిని అక్రమంగా సప్లై చేస్తున్నాడు. కొన్ని నిఘా వర్గాల సమాచారం అందుకున్న నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్(Narcotics Department) సిబ్బంది, స్థానిక పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు.

గ్రేటర్ నోయిడాలోని పార్శ్వనాథ్ పనోరమా సొసైటీలోని ఓ ఫ్లాట్‌లో అక్రమంగా గంజాయి సాగు జరుగుతున్నట్టు తమకు తెలిసిందని డీసీపీ సాద్ మియా ఖాన్ పేర్కొన్నారు. జాయింట్ ఆపరేషన్ చేసి.. గంజాయి సాగు చేస్తున్న మీరట్‌కు చెందిన రాహుల్ చౌదరిని అరెస్టు చేశామని వివరించారు. కొన్ని లక్షల రూపాయల విలువైన గంజాయిని ఆ ఫ్లాట్‌లో సీజ్ చేసినట్టు పేర్కొన్నారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed