- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గ్రీన్ పవర్, మూసీ పునరుజ్జీవం, విద్య మా ప్రాధాన్యత : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రీన్ పవర్ , రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ పునరుజ్జీవం, విద్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య రంగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం సచివాలయంలో సింగపూర్ కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందంతో ఆయన సమావేశం అయ్యారు. కొత్త గ్రీన్ పవర్ పాలసీలో భాగంగా సోలార్, హైడ్రో, పంపుడ్ స్టోరేజీ విభాగాలపై దృష్టి పెట్టినట్టు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్టు సింగపూర్ ప్రతినిధి బృందానికి వివరించారు. మొదటి దశలో 6,00 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు విడుదల చేశామని, ప్రతి పాఠశాలను 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నాము ఇది రాష్ట్ర ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్టు అని వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఒక నగర రాజ్యం, అత్యధికంగా పట్టణాలు ఉన్నాయని పట్టణ అభివృద్ధి పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సింగపూర్ కాన్సల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ మాట్లాడుతూ తెలంగాణతో ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని, డిప్యూటీ సీఎం సహకారం, సందేశం కావాలంటూ పాంగ్ కోరారు. గ్రీన్ ఎనర్జీ , రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ పునరుజ్జీవం, విద్య తమ ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలని ఈ రంగాల్లో సింగపూర్ సంస్థలతో కలిసి పని చేసే అంశంపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ సమావేశంలో సింగపూర్ పొలిటికల్ కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్, సింగపూర్ హై కమిషన్ ప్రథమ ఆర్థిక సెక్రటరీ, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.