- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ల్యాండ్ సర్వే ప్రక్రియ పనులు వేగంగా పూర్తి చేయండి

దిశ, మల్హర్( భూపాలపల్లి): రహదారులు, చిన్న కాలేశ్వరం ప్రాజెక్ట్ప పరిశ్రమల నిర్మాణంలో భాగంగా కోల్పోతున్న ల్యాండ్ సర్వే ప్రక్రియ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ల్యాండ్ సర్వే సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చకచక్యంగా ల్యాండ్ సర్వే పనులు చేసేందుకు రూ.16.78 లక్షల విలువ గల డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డిజిపిఎస్) పరికరాన్ని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కుసుమకుమారికి కలెక్టర్ అందజేస్తూ ఆదేశించారు. సాంకేతికత వినియోగంతో సర్వే ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయవచ్చని అన్నారు. జిల్లాలో పరిశ్రమలు, రహదారుల నిర్మాణం, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేయడానికి డిజిపిఎస్ పరికరం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ పరికరం సాయంతో సర్వే ప్రక్రియ మరింత సులభతరం, ఖచ్చితంగా, పారదర్శకంగా జరుగుతుందన్నారు. సిబ్బందికి ఇది మరింత సౌలభ్యాన్ని కలిగిస్తుందని ప్రాధాన్యతను గమనించి సర్వేలో వేగం పెంచాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎడి కుసుమ కుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సిబ్బందిలు ఉన్నారు.