- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడి చేయకుండా చూడాలి: చైనా
దిశ, నేషనల్ బ్యూరో: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడి చేయకుండా అమెరికా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని చైనా అమెరికాను కోరింది. చైనా దౌత్యవేత్త వాంగ్ యి అమెరికా అధికారి ఆంటోనీ బ్లింకెన్‌తో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత చైనా నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఇరాన్‌ను ఇజ్రాయెల్‌పై దాడి చేయకుండా నిరోధించేందుకు అమెరికా తన ప్రభావాన్ని ఉపయోగించమని చైనా దౌత్యవేత్త ఫోన్‌లో అమెరికాను కోరినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
ఏప్రిల్ 1న ఇజ్రాయెల్ డమాస్కస్‌లోని ఇరాన్ దౌత్య భవనాన్ని నేలమట్టం చేసిన తర్వాత ఇరాన్ దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై దాడి చేస్తుందని, దీంతో ఈ యుద్ధం ప్రపంచదేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపడంతో పాటు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దాడిని ఎలాగైన ఆపాలని ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
మిడిల్ ఈస్ట్ సమస్య పరిష్కారంలో చైనా ముఖ్యమైన పాత్రను కొనసాగిస్తుంది, అయితే దీనిని పరిష్కరించడానికి అమెరికా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ అన్నారు. హమాస్‌కు మద్దతిచ్చే విషయంలో సంక్షోభాన్ని పరిష్కరించాలని చైనాకు అమెరికా పలు విజ్ఞప్తులు చేయగా, చైనా కూడా ఇజ్రాయెల్ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తోందని విమర్శించింది. అయినప్పటికీ ఇప్పుడు చైనా ఇరాన్ దాడిని ఆపాలని అమెరికాను కోరడం విశేషం.