- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు...
దిశ, కామారెడ్డి : జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత మూడు రోజులుగా పేకాట ఆడిన 24 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు.. 2,04,620 రూపాయాల నగదు, 17 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ పోలీస్ స్టేషన్ల పరిధిలో పేకాట ఆడినందుకు పలువురు పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గ్రామాలు, పట్టణాలు, ఫామ్ హౌస్ లలో, ఇళ్ళల్లో, బహిరంగ ప్రదేశాల్లో పేకాట, జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే కామారెడ్డి టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712686109, 8712686133 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు, 100 డయల్ లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.