- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హయత్ నగర్ లో గంజాయి బ్యాచ్ హల్ చల్..
దిశ, ఎల్బీనగర్: హయత్ నగర్ పరిధిలోని పుల్లారెడ్డి స్వీట్ షాప్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఒక గంజాయి బ్యాచ్ సుమారు 25 మంది కలిసి ఒక యువకుడిని విచక్షణారహితంగా బట్టలు విడదీసి కర్రలతో దాడి చేసి తీవ్ర గాయాలకు గురిచేసిన సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే బాలాజీ నగర్ కాలనీకి చెందిన తుమ్మరి ఉప్పలయ్య ట్రాక్టర్ డ్రైవర్ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి ఇరువురు కుమారులు పెద్ద కుమారుడు మహేష్ డిగ్రీ చదువుతూ మధ్యలో చదువు మానేశాడు. ఈరోజు రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో బాలాజీ నగర్ నుండి హయత్ నగర్ ప్రధాన రహదారికి వస్తుండగా పుల్లారెడ్డి స్వీట్ షాప్ వెనుక ప్రాంతంలో గంజాయి సేవిస్తున్నటువంటి సుమారు 20 మంది యువకులు గంజాయి మత్తులో అటుగా వస్తున్న మహేష్ పై దాడి చేయడమే కాకుండా కర్రలతో విచక్షణ రైతంగా బాదడంతో అదే మార్గం గుండా వస్తున్న ఇరువురు యువకులు వారిని అడ్డగించి మహేష్ ను విడిపించారు. దీంతో మహేష్ వారి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో తండ్రి ఉప్పలయ్య సాయంతో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో రాత్రి ఫిర్యాదు చేయడం జరిగింది.
తీవ్ర రక్త గాయాలైన మహేష్ ను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పుల్లారెడ్డి స్వీట్ షాప్ పరిసర ప్రాంత మైనటువంటి నిర్మానుష్య ప్రాంతంలో ప్రతిరోజు ఇక్కడ గంజాయి బ్యాచ్ తిష్ట వేసి గంజాయి సేవిస్తున్నట్టు పలువురు వెల్లడించారు. ఈ విషయంపై పోలీసులు పూర్తి వివరాలు సేకరించి అసలు గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది అనే విషయంలో ఆరా తీసి గంజాయి విక్రయ దారులపై ఉక్కుపాదం మోపాలని స్థానికులు కోరుతున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ గంజాయి రహిత సమాజం పట్ల నిరంతరం కృషి చేస్తూ పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఈ విషయం పట్ల నిర్లక్ష్యం వహించవద్దని పోలీస్ అధికారులకు సూచన చేస్తున్నప్పటికీ ఎక్కడో ఒకచోట గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. ఈ గంజాయి మత్తుకు బానిస అయినటువంటి యువకులు గంజాయి మత్తులో ఎవరిపై దాడి చేస్తున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి అర్థం కాని పరిస్థితుల్లో నేటి యువత మత్తులో ఊగిసలాడుతూ ఇతరులపై దాడి చేస్తూ గాయపరుస్తున్నారు. హయత్ నగర్ బాలాజీ నగర్ కాలనీకి చెందిన మహేష్ పై దాడి చేసింది ఎవరు అనే విషయంలో పూర్తిగా పోలీసు అధికారులు విచారణ జరిపి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.