- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేరుగా రంగంలోకి మాజీ సీఎం కేసీఆర్.. తేల్చి చెప్పిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. మధ్యలో కొద్దిరోజులు కృష్ణ రివర్ వాటర్ ఇష్యూపై మీటింగ్ పెట్టిన మాజీ సీఎం.. అనారోగ్య కారణాలతో కొంతకాలంగా మీడియా ముందుకు, ప్రజల్లోకి రావడం లేదు. అయితే కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావొస్తున్న క్రమంలో.. ఆ పార్టీ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టేందుకు కేసీఆర్ రంగంలోకి దిగనున్నట్లు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ప్రకటించారు. పండుగ పూట ట్విట్టర్ #AskKTRలో కొందరు కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలపై స్పందించిన కేటీఆర్.. వచ్చే ఏడాది నుంచి కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తారని తేల్చి చెప్పారు. అలాగే ప్రస్తుతం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని.. ప్రతిరోజూ మాకు మార్గనిర్దేశం చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హమీలను నెరవేర్చడానికి.. కొద్దిరోజులు సమయం ఇచ్చారని.. 2025 నుంచి కేసీఆర్(KCR) ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందని, అన్నీ కుదిరితే.. 2025 కంటే ముందు ప్రజాక్షేత్రంలోకి వస్తారని కేటీఆర్(KTR) చెప్పుకొచ్చారు.