- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CMR ఇంజినీరింగ్ కాలేజ్ గుర్తింపు రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి: మాచర్ల రాంబాబు
దిశ, వెబ్ డెస్క్: సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల(CMR Engineering College) మహిళా హాస్టల్(Women's Hostel)లో జరిగిన అమానవీయ ఘటన(inhuman incident) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా ఈ ఘటనపై రెండు రోజులుగా విద్యార్థినులతో పాటు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. కాగా ఈ అమానవీయ సంఘటనను తెలంగాణ ఏబీవీపీ(ABVP) తీవ్రంగా ఖండిస్తున్నట్లు.. రాష్ట్ర కార్యదర్శి(State Secretary) మాచర్ల రాంబాబు(Macharla Rambabu) ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో ఆయన మాట్లాడుతూ.. సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల మహిళా హాస్టల్ బాత్రూం లో వీడియోల చిత్రీకరణకు కళాశాల యాజమాన్యమే పూర్తి బాధ్యత అని,, వెంటనే CMR కళాశాల గుర్తింపును రద్దు చేయాలని ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు(Macharla Rambabu) డిమాండ్ చేశారు. ఈ ఘటనపై వెంటనే సత్వర విచారణకు ఆదేశించాలని, ఇప్పటి వరకు ప్రభుత్వం, పోలీసులు స్పందించకపోవడం దురదృష్టకరం అన్నారు. అమ్మాయిల భద్రత, మానప్రాణాలకు సంబంధించిన విషయంలో కళాశాల యాజమాన్యానికి అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గు చేటు అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటనపై అమ్మాయిలకు న్యాయం జరిగి, దోషులకు శిక్ష పడే వరకు వరకు విద్యార్థినులకు ABVP అండగా ఉంటుందని ఆ వీడియోలో తెలిపారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే హాస్టల్ వార్డెన్ ప్రీతి రెడ్డిని అరెస్ట్ చేశారు.