Karnataka : కర్ణాటకలో బస్సు ఛార్జీల పెంపు.. జనవరి 5 నుంచి అమలు

by Sathputhe Rajesh |
Karnataka : కర్ణాటకలో బస్సు ఛార్జీల పెంపు.. జనవరి 5 నుంచి అమలు
X

దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటక ప్రభుత్వం బస్సు ఛార్జీలను 15 శాతం పెంచింది. ఈ మేరకు గురువారం కేబినెట్ ఆమోదం తెలిపింది. జనవరి 5 నుంచి పెంచిన ధరలు అమలులోకి వస్తాయని మంత్రి హెచ్‌కే పాటిల్ మీడియాతో తెలిపారు. పెంచిన బస్సు ఛార్జీలతో ఆర్టీసీకి ప్రతి నెల రూ.74.85కోట్లు సమకూరనున్నట్లు మంత్రి వెల్లడించారు. ధరల పెంపు తర్వాత కూడా ఛార్జీలు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రతో పోలిస్తే తక్కువగా నే ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల రెండు ప్రధాన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ధరలను పెంచుతున్నామన్నారు. మహిళలకు కర్ణాటకలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుండగా.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5,200 కోట్లను వెచ్చించామన్నారు. 2020 తర్వాత తొలిసారిగా కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కేఎస్ఆర్టీసీ), నార్త్ వెస్టర్న్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్(ఎన్‌డబ్ల్యూకేఆర్టీసీ), కల్యాణ కర్ణాటక రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (కేకేఆర్టీసీ) ధరలు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed