- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL: రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌కు షాక్ ఇచ్చిన యాజమాన్యాలు
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్(IPL) 2024లో సత్తాచాటి.. తమ జట్టులో కీలకంగా నిలిచిన ప్లేయర్లకు ఐపీఎల్ జట్ల యాజమాన్యం షాక్ ఇచ్చాయి. ఇందులో ఇండియన్ ప్లేయర్ రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఉన్నారు. ఢిల్లీ జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన పంత్ ను వేలంలోకి వదిలేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే గత సీజన్లో కలకత్తా(KKR) జట్టును విజయతీరాలకు చేర్చడమే కాకుండా.. ఏకంగా టైటిల్ సాధించిపెట్టిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను ఆ జట్టు వదులుకోవడం తో అందరు ఆశ్చర్యానికి గురయ్యారు. అలాగే అందరూ ఊహించినట్లుగానే లక్నో జట్టు కేఎల్ రాహుల్ ను జట్టు నుంచి తప్పించడమే కాకుండా.. వెస్టిండీస్ ప్లేయర్ పూరన్ కు ఏకంగా 21 కోట్లు ఇచ్చి కెప్టెన్ హోదాలో రిటైన్ చేసుకున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ ముగ్గురు భారత ప్లేయర్లు డిసెంబర్ లో జరిగే వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు ప్రకటించిన రిటెన్షన్ లిస్టులో.. పంజాబ్ జట్టు అత్యల్పంగా ఇద్దరిని మాత్రమే రిటైన్ చేసుకోగా.. కలకత్తా జట్టు ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. కాగా ఈ మెగా వేలంలో అత్యధికంగా పంజాబ్ జట్టు రూ. 112 కోట్ల పర్స్ వ్యాల్యూ ఉండగా.. అత్యల్పంగా హైదరాబాద్ జట్టు రూ. 45 కోట్లు పర్సు వ్యాల్యూ ని కలిగి ఉంది.