పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి..

by Naveena |
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి..
X

దిశ ,ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలం మచ్చర్ల గ్రామంలోని ఓ పేకాట స్థావరంపై గురువారం టాస్క్ ఫోర్స్ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేశారు. మచ్చర్ల లోని ఓ ఫంక్షన్ హాల్ లో పేకాట ఆడుతున్నారన్న పక్క సమాచారం మేరకు.. టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య ఆధ్వర్యంలో సిసిఎస్ పోలీసులు దాడి చేసి పేకాట రాయుళ్లను పట్టుకున్నారు. పేకాట స్థావరంపై దాడి చేసి 7 గురు పేకాటరాయుళ్లను, ఐదు సెల్ ఫోన్ లను, 59,620 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం పేకాట స్థావరంలో పట్టుబడిన పేకాటరాయలను ఆర్మూర్ ఎస్హెచ్ఓ కు అప్పగించారు.

Advertisement

Next Story