- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వాంకిడిలో 2 క్వింటాళ్ల గంజాయి పట్టివేత..
దిశ, వాంకిడి: పుష్ప సినిమాను తలపించేలా మత్తు పదార్థాలను అంతరాష్ట్ర నేరగాళ్లు అక్రమ రవాణా చేస్తున్నారు. గురువారం ఇదే తరహాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి నుంచి మధ్యప్రదేశ్ కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్యాంకర్ లో గంజాయి నింపి సినిమా తరహాలో అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు వాంకిడి ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద లారీ ఆపి తనిఖీ చేయగా ట్యాంకర్ లో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ట్యాంకర్ ను సీజ్ చేసి అందులో నుండి 145 ప్యాకెట్లలో 2 క్వింటాళ్ల 90 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 75 లక్షల పైనే ఉంటుందని పోలీస్ అధికారులు భావిస్తున్నారు. ట్యాంకర్ డ్రైవర్ బల్బీర్ సింగ్ పర్మల్ ను అదుపులోకి తీసుకుని గంజాయి ఎవరు సరఫరా చేస్తున్నారు. ఇందులో ఎంతమంది ఉన్నారు. ఎప్పటి నుంచి రవాణా చేస్తున్నారు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.