Disha effect: దిశ ఎఫెక్ట్.. కి లేడీ పై కేసు నమోదు

by Naveena |
Disha effect: దిశ ఎఫెక్ట్.. కి లేడీ పై కేసు నమోదు
X

దిశ, సూర్యాపేట టౌన్: సూర్యాపేట జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా చిన్నారుల విక్రయాల పేరుతో అమాయక ప్రజల దగ్గర డబ్బులు కాజేస్తున్న కి లేడి పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 30 న కిలేడి గ్యాంగ్ జిల్లాలో గుట్టుగా చిన్నారుల విక్రయ దందా అనే కథనాన్ని దిశ దిన పత్రిక ప్రచురితం చేసింది. దిశదిన పత్రిక లో ప్రచురితమైన వార్త కథనానికి సూర్యాపేట జిల్లా పోలీసులు స్పందించారు. శిశు విక్రయాల పేరుతో మోసం చేస్తున్న కి లేడీ పై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు గురువారం తెలిపారు. చిన్నారుల విక్రయాల పేరుతో మోసాలకు పాల్పడిన కి లేడి పై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అన్ని కోణాలల్లో దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఈ కీ లేడీ లు ఏ జిల్లాలోనేన శిశు విక్రయాలు జరిపారా? వీరిపై గతంలో ఏ పోలీస్ స్టేషన్ ల్లో కేసు లు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. శిశు విక్రయాలకు సంబంధించిన కేసు వివరాలను త్వరలో పూర్తి చేసి , వాటిని బహిర్గతం చేస్తామని సూర్యాపేట పట్టణ సిఐ రాజశేఖర్ వెల్లడించారు.

Advertisement

Next Story