- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మంచుతుఫాను విలయం.. చీకట్లో లక్షలాది ఇళ్లు.. వేలాది విమానాలు రద్దు
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాలో మంచు తుఫాను జన జీవనాన్ని స్తంభింపజేసింది. దేశంలోని మధ్య పశ్చిమ ప్రాంతంలో ఉన్న చాలా నగరాలపై దీని ఎఫెక్ట్ పడింది. ఎయిర్ పోర్టుల రన్ వేలపై దట్టమైన మంచురాశులు పేరుకుపోవడంతో విమానాల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. దాదాపు 2వేల విమానాలు రద్దయ్యాయి. 6వేల విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. చికాగోలోని ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయం 40 శాతం విమాన సర్వీసులను రద్దు చేసింది. డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, మిల్వాకీ మిచెల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో పాటు పలు విమానాశ్రయాలు పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేశాయి. తీవ్ర మంచు తుఫాను కారణంగా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. గ్రేట్ లేక్స్, ది సౌత్ ప్రాంతాలలో దాదాపు 2.50 లక్షల ఇళ్లు, వ్యాపార సముదాయాలకు విద్యుత్ సరఫరా కావడం లేదు. ఇల్లినాయిస్‌లో దాదాపు 97,000 మంది చీకటిలో మగ్గుతున్నారు.