- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆయుధాల ఉత్పత్తి సహకారంపై ఉక్రెయిన్, UK ఒప్పందం
దిశ, నేషనల్ బ్యూరో: రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ ఉక్రెయిన్ క్రమంగా తన ఆయుధాలను పెంచుకోవాలని చూస్తుంది. గత రెండేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటికే ఉక్రెయిన్‌కు ఇతర దేశాలు సహాయం అందించగా, తన ఆయుధ సంపత్తి చాలా వరకు తగ్గింది. ఈ నేపథ్యంలో రక్షణ, ఆయుధాల ఉత్పత్తి సహకారంపై ఉక్రెయిన్, UKతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మిత్ర దేశాలతో కలిసి పనిచేయడం ద్వారా దేశీయ ఆయుధ పరిశ్రమను నిర్మించడానికి అవకాశాలు ఏర్పడుతాయని అధికారులు తెలిపారు.
దీనికి సంబంధించి కైవ్‌లోని సైనిక పరిశ్రమలో ఒక సమావేశం జరిగింది. దీనికి దాదాపు బ్రిటన్‌కు చెందిన 30 డిఫెన్స్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. వారి సమక్షంలో ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. బ్రిటిష్ కంపెనీలు, ఉక్రెయిన్ కంపెనీలతో కలిసి పనిచేసి, సంయుక్తగా ఆయుధాలను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. బ్రిటన్ వాణిజ్య విధాన మంత్రి గ్రెగ్ హ్యాండ్స్ మాట్లాడుతూ, ఈ డీల్ ద్వారా ఉక్రెయిన్‌కు లాభాలు ఉంటాయని, దీర్ఘకాలికంగా దాని దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 2022లో ప్రారంభం కాగా మొదట్లో పాశ్చాత్య భాగస్వాముల నుండి సైనిక మద్దతు రాగా, క్రమంగా అది క్షీణిస్తుంది. దీంతో ఉక్రెయిన్ తన స్వంత ఆయుధాలను ఉత్పత్తి చేయడానికి పలు దేశాలతో ఒప్పందాలు చేసుకుంటుంది. రష్యా లోపల లోతైన దాడులను నిర్వహించడాని సుదీర్ఘ-శ్రేణి దాడి డ్రోన్‌ల కోసం ఉక్రెయిన్ ఈ సంవత్సరం సుమారు 10 లక్షల ఫస్ట్-పర్సన్ వ్యూ (FPV) డ్రోన్‌లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలో డ్రోన్ ఉత్పత్తి రంగంలో ఈ ఏడాది మరిన్ని ప్రాజెక్టులు వస్తాయని అధికారులు పేర్కొన్నారు.